NEWSANDHRA PRADESH

ఏపీలో ముఠాల పాల‌న – వైఎస్ జ‌గ‌న్

Share it with your family & friends

గాడి త‌ప్పిన స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం

అమ‌రావ‌తి – వైఎస్ఆర్సీపీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఏపీ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. పూర్తిగా పాల‌న గాడి త‌ప్పింద‌ని మండిప‌డ్డారు.

ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన న‌డుస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు కేరాఫ్ గా మారి పోయిందని ఆరోపించారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయ‌ని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఏపీ సీఎం.

నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాల‌ని పేర్కొన్నారు. ఎవరూ ప్రశ్నించ కూడదని, రోడ్డు పైకి రాకూడదని ప్రజలను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

త‌మ నాయకులు, కార్యకర్తలను భయ భ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామ‌ని హెచ్చ‌రించారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.