వక్ఫ్ బోర్డు అవినీతిమయం – మౌలానా
ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్ కూడా
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ లో పూర్తి నియంత్రణకు సంబంధించి కీలకమైన బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యూసుబ్ అబ్బాస్. ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు పూర్తిగా అవినీతిమయం అయ్యిందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ల్యాండ్ మాఫియాలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు.
ప్రతి ఒక్కరు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే వక్ఫ్ బోర్డు నియంత్రణకు సంబంధించిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు పర్సనల్ లా బోర్డు చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.