పనుల ఆలస్యం కోమటిరెడ్డి ఆగ్రహం
ఉప్పల్ కారిడార్ కు టెండర్లు పిలవండి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆకస్మికంగా హైదరాబాద్ లోని ఉప్పల్ కారిడార్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇలాగేనా పనులు చేపట్టడం అంటూ మండిపడ్డారు.
ఎందుకు ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ పనులు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రూ. 600 కోట్లతో 2018లో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటి వరకు పూర్తి కాక పోవడం దారుణమన్నారు. ఆలస్యానికి గల కారణాలు ఏమిటో తనకు తెలియాలని స్పష్టం చేశారు.
దాదాపు 6 ఏళ్లు కావస్తున్నా 6 కిలో మీటర్లు కూడా పూర్తి చేయక పోవడం పట్ల సీరియస్ అయ్యారు మంత్రి. వెంటనే పనులు ప్రారించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆరు రోజుల్లో పనుల ప్రగతికి సంబంధించి టెండర్లు పిలవాలని ఆదేశించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.