బుల్లి బైక్ పై మంత్రి పారా హుషార్
వినూత్నంగా తయారు చేసిన యువకులు
నల్లగొండ జిల్లా – రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బుల్లి బైక్ పై ప్రయాణం చేశారు. ప్రజల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా బుల్లి బైక్ ను నడుపుతూ ఆకట్టుకున్నారు. ఫాగింగ్ కు అనువుగా ఉండేలా స్థానిక యువకులు గణేష్ , తదితరులను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో వచ్చే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇక నల్లగొండలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను తీసుకున్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరో వైపు పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతూనే యువతకు మార్గ నిర్దేశం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. వర్షాకాలం కావడంతో నగరంలో భారీ ఎత్తున దోమల బెడద తీవ్రంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
ఇదిలా ఉండగా దీని నివారణ కోసం 19వ వార్డు కౌన్సిలర్ కుమారుడు గోగుల గణేష్ , వార్డులోని కొందరు యూత్ కలిసి దోమల నివారణకు అనువుగా ఉండే ఫాగింగ్ మిషన్ తో కూడిన బుల్లి బైక్ ను తయారు చేశారు. దానిని స్వయంగా మంత్రి నడపడం విశేషం.