తమిళనాడు సర్కార్ ను చూసి నేర్చుకోండి
నిప్పులు చెరిగిన అనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. తాజాగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసిందన్నారు. ఇందులో జాబ్స్ లేవు క్యాలెండర్ కానే కాదన్నారు. ఎందుకు శ్రద్ద పెట్టలేదని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారని, అధికారంలోకి వచ్చాక వాటిని భర్తీ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ రాకేశ్ రెడ్డి నిలదీశారు.
ఆయన బీఆర్ఎస్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగులపై దాడులకు దిగుతున్నారని, వారి విలువైన కాలాన్ని వేస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతే కాదు చాలా మందిని అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సబబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనుగుల రాకేశ్ రెడ్డి.
బీహార్, తమిళనాడు రాష్ట్రాలు జాబ్ క్యాలెండర్లను తయారు చేశాయని, అక్కడి ప్రభుత్వాలు తేదీల వారీగా , పోస్టుల వారీగా , రిజల్ట్స్ అనౌన్స్ చేసే డేట్స్ కూడా ప్రకటిస్తూ వస్తున్నాయని అన్నారు. ఎందుకని ఇలాంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని ఫైర్ అయ్యారు.