NEWSANDHRA PRADESH

సోమిరెడ్డి ధ‌న దాహం రైతుల‌కు శాపం

Share it with your family & friends

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి ఫైర్

నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ధ‌న దాహానికి రైతులు నిట్ట నిలువునా మోస పోతున్నార‌ని వాపోయారు. యాష్ పాండ్ గండి పడి రైతుల పొలాలు సర్వనాశనం అయ్యాయ‌ని ఆరోపించారు.

సోమిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు యాష్ పాండ్ టెండర్లు పిలిచార‌ని, కాంట్రాక్ట‌ర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకొన్నాడ‌ని , రైతుల ప్ర‌యోజ‌నాల‌ను విస్మ‌రించాడ‌ని మండిప‌డ్డారు. తెగిపోయిన యాష్ పాండ్ వాస్తవాలు వెలుగు చూడాలంటే, పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించాల‌ని కాకాణి డిమాండ్ చేశారు.

సోమిరెడ్డి ధనదాహానికి దేవర దిబ్బ గిరిజనులు బలయ్యారంటూ ఫైర్ అయ్యారు . యాష్ పాండ్ ప్రమాదానికి బూడిద పూడిక తీత‌ పనులకు సోమిరెడ్డి అడ్డంకి సృష్టించాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. నెలకు 16 బల్కర్ల ద్వారా ఫ్లై యాష్ అక్రమ రవాణా చేస్తూ, నెలకు 16 లక్షలు గడిస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి.

సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి ప్రజల క్షేమం కోసం, సంచులు తీసుకొని తిరగడం, దుప్పట్లు పరవడం కొద్దిరోజులైనా ఆపితే మంచిదన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యునిగా కానీ, అధికార శాసనసభ్యునిగా కానీ, మంత్రిగా కానీ, ఎన్నడైనా ఏపీ జెన్కోకు సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా, నా జోక్యాన్ని నిరూపించగలవా అని స‌వాల్ విసిరారు మాజీ మంత్రి.