ఆందోళనకారులకు పీఎం వార్నింగ్
నిరసన విరమిస్తే మంచిదని సూచన
యునైటెడ్ కింగ్ డమ్ – యూకే ప్రస్తుతం ఆందోళనకారులతో, నిరసనలతో హోరెత్తుతోంది. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయినా నిరసన కారులు ఎక్కడా తగ్గడం లేదు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తాము తగ్గేదే లేదంటూ పేర్కొంటున్నారు.
ఈ తరుణంలో యూకే ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులు వెంటనే పోరాటాన్ని, నిరసనను విరమించాలని స్పష్టం చేశారు. లేక పోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ హెచ్చరించారు.
మీ చర్యలు ఇలాగే కొనసాగించాలని భావిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు స్టార్మర్. ఇదిలా ఉండగా యూకేలో చోటు చేసుకున్న ఆందోళనలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ బిలీయనీర్, టెస్లా చైర్మన్, ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్. దేశంలో అంతర్యుద్దం తప్పేలా లేదన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.