యూకేలో హింసోన్మాదానికి తావు లేదు
ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం
యునైటెడ్ కింగ్ డమ్ – యూకే మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకున్న అల్లర్లు, ఆందోళనల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
గత 13 ఏళ్ల కాలంలో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తాను భావించడం లేదన్నారు రిషి సునక్. బ్రిటన్ వీధుల్లో చోటు చేసుకున్న ఈ దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు తనను కలిచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రిషి సునక్.
ఇక సౌత్ పోర్ట్ లో జరిగిన విషాదానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది మన సమాజంలో చోటు లేని హింసాత్మక, నేర పూరిత ప్రవర్తన అంటూ పేర్కొన్నారు మాజీ పీఎం. ఈ అసాంఘిక కార్యకలాపాల వెనుక, ఆందోళనలు, నిరసనల వెనుక, నేర పూరితమైన ప్రవర్తనల వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ సందర్బంగా యూకే పోలీసులకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు మాజీ పీఎం రిషి సునక్.