NEWSANDHRA PRADESH

ప‌చ్చ‌ద‌నం అభివృద్దికి అధిక ప్రాధాన్య‌త

Share it with your family & friends

మంత్రి పొంగూరు నారాయ‌ణ కామెంట్

విజ‌య‌వాడ – రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం అభివృద్ది చేసేందుకు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించార‌ని అన్నారు ఏపీ మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. సోమ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ లోని వెట‌ర్న‌రీ కాల‌నీలోని మున్సిప‌ల్ పార్క్ లో కొత్త‌గా నిర్మించిన జిమ్ ను ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించిన నారాయ‌ణ ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు ఫోక‌స్ పెట్టాల‌న్నారు. స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్,అర్భ‌న్ గ్రీనింగ్ కార్పొరేష‌న్ ద్వారా ప‌చ్చ‌ద‌నం అభివృద్డికి చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.

పార్కులు, ప‌చ్చ‌ద‌నం , వాకింగ్ ట్రాక్ లు అభివృద్దిపై సీఎం దృష్టి పెట్టార‌ని తెలిపారు . వెట‌ర్న‌రీ కాల‌నీలోని సమ‌స్య‌ల‌పై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చిస్తామ‌న్నారు మంత్రి. ప్ర‌త్యేకించి విజ‌యవాడ అభివృద్దిపై ప్ర‌జా ప్ర‌తినిధులు, వీఎంసీ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తానని ప్ర‌క‌టించారు పొంగూరు నారాయ‌ణ‌.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో చేప‌ట్టిన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప‌నులు పూర్తిచేయాల్సిన అవ‌సరం ఉందన్నారు.అయితే ఎలాంటి ప‌నులు చేయాల‌న్నా నిధుల కొర‌త చాలా ఎక్కువ‌గా ఉందన్నారు.

కేంద్రం నుంచి 27 వేల కోట్లు కేటాయిస్తే గ‌త ప్ర‌భుత్వం రాష్ట్ర వాటా ఇవ్వ‌క పోవ‌డంతో నిధులు విడుద‌ల కాలేద‌ని చెప్పారు.