NEWSNATIONAL

బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు వెంట క‌ర్ఫ్యూ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మేఘాల‌య ప్ర‌భుత్వం

మేఘాల‌య – రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఇవాల్టి నుంచి రాత్రి పూట నిర‌వధికంగా ఇండియా- బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.

ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బంగ్లా నుంచి వ‌ల‌స‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సలహా మేరకు భారత భూభాగంలోని సరిహద్దు రేఖకు 200 మీటర్ల లోపల బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన‌ట్లు వెల్ల‌డించింది.

బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలు సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ ప్రాంతానికి వెళ్లవద్దని మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టిన్‌సాంగ్ కోరారు.