NEWSINTERNATIONAL

షేక్ హ‌సీనాకు యుకె నో ఛాన్స్

Share it with your family & friends

ఇంకా అనుమ‌తి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం

బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ లో రాజ‌కీయ అనిశ్చితి కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగ‌డం , 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవ‌డంతో గ‌త్యంత‌రం లేక ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు షేక్ హ‌సీనా. దాడికి దిగే ప్ర‌మాదం పొంచి ఉండ‌డంతో ముందే ప‌సిగ‌ట్టిన హ‌సీనా త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తుగా ఉంటూ వ‌చ్చిన భార‌త దేశాన్ని ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో ఆమె స్వ‌యంగా మాట్లాడారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు.

అంత‌కు ముందు షేక్ హ‌సీనా లండ‌న్ కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌జ‌లు త‌న నివాసంపై మూకుమ్మ‌డి దాడి చేశారు. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య భార‌త్ కు చేరుకున్నారు. ఆమెకు భారీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది మోడీ ప్ర‌భుత్వం.

ఇదిలా ఉండ‌గా షేక్ హసీనా యూకే వెళ్లేందుకు ఇంకా అనుమ‌తి ల‌భించ‌లేదు. అక్క‌డ కూడా గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. అక్క‌డి నుంచి ప‌ర్మిష‌న్ వ‌చ్చేంత దాకా త‌ను ఇండియాలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.