అజిత్ దోవల్ తో షేక్ హసీనా భేటీ
తనను రక్షించాల్సిందిగా విన్నపం
న్యూఢిల్లీ – బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఇండియాకు కట్టుదిట్టమైన భద్రత మధ్య చేరుకుంది. ఆమె ప్రస్తుతం తనకు రక్షణ కల్పించాల్సిందిగా యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే అక్కడ అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం షేక్ హసీనా తమ దేశానికి వచ్చేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.
దీంతో షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రజలు ఆమెను తిరస్కరించారు. ముఖ్యంగా యువతీ యువకులు హసీనా కనిపిస్తే చంపేసేంత కోపంతో ఉన్నారు. దీంతో బిక్కు బిక్కుమంటూ షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు.
ఈ సందర్బంగా భారత ప్రభుత్వం ఆమెకు పూర్తి భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తనకు ముందు నుంచీ పరిచయం ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఊపిరి పీల్చుకుంది షేక్ హసీనా.
భారత్ లో ఉన్న ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలుసుకుంది. భవిష్యత్తు పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు దోవల్ కీలకంగా మారనున్నారు.