షేక్ హసీనా లో దుస్తులు లూటీ
బంగ్లాదేశ్ లో ఆర్మీ సైనిక పాలన
బంగ్లాదేశ్ – షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆమె నివాసాన్ని ఆందోళనకారులు లూటీ చేశారు. ఎవరికి తోచినంత వారు వస్తువులను తీసుకు వెళ్లారు. విచిత్రం ఏమిటంటే షేక్ హసీనా నిత్యం వాడే లో దుస్తులు బ్రాలు, చీరలు, రవికలు కూడా తీసుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
లో దుస్తులే కాకుండా చేపలు, డస్ట్ బిన్ లు, కుర్చీలు, ఇతర సామాగ్రి మొత్తం షేక్ హసీనా నివాసం నుండి ఎత్తుకు వెళ్లారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్ దేశానికి పట్టిన శని పోయిందంటూ యువకులు మండిపడ్డారు.
చీరలు సైతం లూటీ చేశారు. షేక్ హసీనా నివాసంలోని వంట గదిలో ఉన్న సామాన్లను కూడా తీసుకు వెళ్లడం విస్తు పోయేలా చేసింది. యావత్ ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న తాజా పరిమాణాలను నిశితంగా గమనిస్తోంది.
ఇదిలా ఉండగా షేక్ హసీనా ప్రస్తుతం ప్రాణ రక్షణ కోసం భారత దేశంలో తల దాచుకుంది. యూకేకు వెళ్లాలని అనుకున్నా అక్కడి నుంచి ప్రభుత్వం ఆమెకు అనుమతి ఇవ్వలేదు.