తల వంచిన నియంత పాలన
ఇండియాకు పారి పోయిన హసీనా
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ లో ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. గత 15 సంవత్సరాలుగా నియంతృత్వ పాలన కొనసాగించింది. ఆర్మీని అడ్డం పెట్టుకుని వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. తనకు వ్యతిరేకంగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ నామ రూపాలు లేకుండా చేసింది.
చివరకు ప్రజలు, యువతీ యువకులు రాచరిక పాలనకు చరమ గీతం పాడారు. మొన్నటికి మొన్న శ్రీలంకలో కూడా ఇలాగే జరిగింది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ప్రెసిడెంట్ పారి పోయాడు. తన కుటుంబం వేరే దేశంలో తల దాచుకుంది.
ఇలాంటి పరిస్థితి ఇప్పుడు షేక్ హసీనా ఎదుర్కొంది. ఆమె తన నివాసాన్ని ఖాళీ చేశారు. ప్రజలు తన ఇల్లును లూటీ చేశారు. చివరకు ఆమె వాడే బ్రాలు, బ్లౌజులు, చీరలను కూడా ఎత్తుకు వెళ్లారు. హసీనా పట్ల తమకు ఉన్న కసిని ఈ విధంగా తీర్చుకున్నారు.
ఇదిలా ఉండగా మాజీ సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షేక్ హసీనా పట్ల. తన పాలనా కాలంలో హసీనా ప్రజలకు ఓటు హక్కు లేకుండా , మాట్లాడేందుకు స్వేచ్ఛ ఇవ్వకుండా , ప్రాథమిక అవసరాలు లేకుండా చేశారు. 180 మిలియన్ల పీడిత ప్రజలు ఫాసిస్ట్ షేక్ హసీనా నుండి విముక్తి పొందారంటూ పేర్కొన్నారు. 10,000 మంది పిల్లలను, స్త్రీలను, పురుషులను చంపించిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ఆమెకు ఆశ్రయం ఇచ్చే ఏ దేశమైనా నేరస్థుల, దొంగల దేశంగా పరిగణిస్తామని ప్రకటించారు.