హసీనా తండ్రి రెహమాన్ విగ్రహాలు ధ్వంసం
బంగ్లాదేశ్ లో వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం
బంగ్లాదేశ్ – ప్రజల ఆగ్రహం ఇంకా చల్లారలేదు బంగ్లాదేశ్ లో. గత కొన్నేళ్లుగా షేక్ హసీనా సాగించిన నియంతృత్వ పాలన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్య గత్యంతరం లేక హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇంటి నుంచి పారి పోయారు భారీ భద్రత నడుమ. ఆమె అక్కడి నుంచి ఇండియాకు విచ్చేశారు. లండన్ లో తల దాచు కోవాలని భావించింది. కానీ యూకేలో కూడా పరిస్థితులు బాగోలేవు. ఇదిలా ఉండగా హసీనా ఖాళీ చేసిన వెంటనే ప్రజలు , యువకులు పెద్ద ఎత్తున ఆమె నివాసంలోకి దూరారు. ఇంట్లో ఉన్న వస్తువులను లూటీ చేశారు.
మరో వైపు హసీనా పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి నాయకత్వం వహించిన నాయకుడిగా ఆరాధిస్తూ వచ్చారు.
కాలక్రమేణా పార్టీ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య అవినీతి కారణంగా పాలన గాడి తప్పింది. 1975లో పత్రికలను నిషేధించడం, ప్రతిపక్ష పార్టీలను రద్దు చేశారు. ఏక పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జనం హత్య చేసేంత దాకా వెళ్లింది.
2008లో రెండోసారి అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరించింది. ప్రజాస్వామ్యం ముసుగులో పూర్తి నియంతృత్వ, రాచరిక పాలనను సాగించింది. చివరకు ప్రజా ఆగ్రహానికి గురై పారి పోయేలా చేసింది హసీనాను.