NEWSNATIONAL

బంగ్లాదేశ్ ప‌రిస్థితుల‌పై కీల‌క స‌మావేశం

Share it with your family & friends

ఆల్ పార్టీ మీటింగ్ లో జై శంక‌ర్ వివ‌ర‌ణ

న్యూఢిల్లీ – ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ లో రాజ‌కీయ అనిశ్చితి ఇంకా కొన‌సాగుతోంది. అక్క‌డ సైనిక పాల‌న విధించిన‌ట్లు ఆర్మీ ప్ర‌క‌టించింది. ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సైనికాధిప‌తి కోరారు. ఇదే స‌మ‌యంలో నిన్న‌టి దాకా 15 ఏళ్ల‌కు పైగా నియంతృత్వ పాల‌న కొన‌సాగించిన ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా ఉన్న‌ట్టుండి త‌ల వంచారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న ఇంటిని ఖాళీ చేసి యూకేకు బ‌య‌లు దేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ త‌రుణంలో అక్క‌డి ప్ర‌భుత్వం షేక్ హ‌సీనా వ‌చ్చేందుకు ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీంతో నిన్న‌టి దాకా మిత్ర దేశంగా ఉన్న భార‌త దేశంతో షేక్ హ‌సీనా మంత‌నాలు జ‌రిపారు. తన‌కు త‌క్ష‌ణ‌మే ఇండియాలో ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని కోరారు. ఇందుకు భార‌త ప్ర‌భుత్వం ఒప్పుకుంది. ఈ మేర‌కు ఆమెకు గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది.

ఇదే స‌మ‌యంలో షేక్ హ‌సీనా ప్ర‌ధాన మంత్రి మోడీతో పాటు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ తో భేటీ అయ్యారు. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి మంగ‌ళ‌వారం విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జై శంక‌ర్ అఖిల‌ప‌క్షంతో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ తాజా ప‌రిస్థితుల‌పై వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.