మా అమ్మ హసీనా బంగ్లాదేశ్ కు రాదు
ప్రకటించిన కొడుకు సజీవ్ జాయ్
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా తనయుడు సజీవ్ జాయ్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఇక బంగ్లాదేశ్ కు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదని ప్రకటించారు. ప్రతిసారీ దేశాన్ని రక్షించడంలో తమ కుటుంబం అలిసి పోయిందని వాపోయారు సజీవ్ జాయ్ .
ఇప్పుడు హిందువులు తీవ్ర భయాందోళనలో కొనసాగుతున్నారని, ప్రధానంగా హిందూ దేవాలయాలపై ఛాందసవాదులు దాడులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ను అన్ని రంగాలలో బలోపేతం చేసే దిశగా తన తల్లి షేక్ హసీనా ప్రయత్నం చేసిందన్నారు సజీవ్ జాయ్.
ఆమె అధికారంలోకి వచ్చిన సమయంలో బంగ్లాదేశ్ విఫలమైన, అత్యంత పేద దేశంగా పరిగణించే వారని, కానీ ఇవాళ బంగ్లాదేశ్ ఆసియాలో అత్యంత బలమైన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు షేక్ హసీనా కుమారుడు.
మూడు సార్లు తమ కుటుంబం తిరుగుబాటును ఎదుర్కొందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయిందన్నారు. ఇక తామేమీ చేయలేమంటూ పేర్కొన్నారు.