9న శ్రీవారి గరుడ సేవ – టీటీడీ
7న తోటోత్సవం..9న గరుడ సేవ
తిరుమల – తిరుమలలో శ్రీవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఈనెలలో పెద్ద ఎత్తున స్వామి వారికి ఉత్సవాలను నిర్వహిస్తోంది. 7న బుధవారం శ్రీవారి పురిశైవారి టోతోత్సవం నిర్వహించనుంది.
ఆగస్టు 9న గరుడ పంచమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ చేపట్టనుంది. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు వెల్లడించింది టీటీడీ.
ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నామని పేర్కొంది. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్ర స్థాపన ఉత్సవం, 19న శ్రావణ పౌర్ణమి , పౌర్ణమి గరుడ సేవ ఉంటుందని తెలిపింది టీటీడీ.
ఆగస్టు 27న దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి సందర్బంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. ఉత్సవాలను పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలు, ఇతర దర్శనాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.