హిందువుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు
ప్రకటించిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్
బంగ్లాదేశ్ – అంతర్యుద్దంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ఆందోళనలు, నిరసనల మధ్య ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. తను అన్నింటిని వదిలేసి ప్రాణ భయంతో పారి పోయారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముస్లిం మత ఛాందసవాదులు పెద్ద ఎత్తున పేట్రేగి పోతున్నారు.
వారంతా హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగ బడుతున్నారు. ఎక్కడికక్కడ కనిపించిన చోటల్లా హిందూ పవిత్ర స్థలాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసానికి దిగుతున్నారు. మరికొందరు కావాలని హిందువులు ఎవరైనా ఉంటే విచక్షణ కోల్పోయి దాడి చేయడం ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఈ తరుణంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా నివసిస్తున్న హిందువుల కోసం బంగ్లా ఆర్మీ హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. వివిధ జిల్లాలోని హిందువులకు ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండడంతో వారి సంఖ్యతో కూడిన జాబితాను సిద్దం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి దయనీయంగా ఉంది.