NEWSNATIONAL

బంగ్లాదేశ్ ఆర్మీతో ప‌రిస్థితిపై ఆరా

Share it with your family & friends

ఆందోళ‌న వ్య‌క్తం చేసిన జై శంక‌ర్
న్యూఢిల్లీ – బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది మోడీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు పార్ల‌మెంట్ సాక్షిగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు విదేశాంగ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జై శంక‌ర్. మంగ‌ళారం ఆయ‌న ప్ర‌సంగించారు.

బంగ్లాదేశ్ లో ఉన్న భారత్ దేశ వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం కాపాడుతుందని అశిస్తున్నామ‌ని చెప్పారు.. మైనారిటీలు, వారి వ్యాపారాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు జై శంక‌ర్ .

ప్ర‌ధానంగా హిందువులు, ప్రార్థ‌నా మందిరాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్నాయ‌న్న వార్త‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర మంత్రి. ఇవాళ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.

ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి త‌మ ప్ర‌భుత్వం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూనే ఉంద‌న్నారు. ఏది ఏమైనా బంగ్లాతో భార‌త్ కు అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.