NEWSANDHRA PRADESH

శ్రీ‌వారి టికెట్లు అమ్మేంత నీచుడిని కాను

Share it with your family & friends

అంత దౌర్భాగ్యం ప‌ట్ట‌లేద‌న్న ఎమ్మెల్సీ

అమ‌రావ‌తి – త‌న‌పై శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భ‌ర‌త్ . మంగ‌ళ‌వారం ఎక్స్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం త‌న‌కు ప‌ట్ట‌లేద‌ని పేర్కొన్నారు భ‌ర‌త్. తాను ఒక బ్యూరోక్రట్‌ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలిపారు. ఉన్నత విలువలతో బ్రతికానని, త‌న తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్ అని వెల్ల‌డించారు.

త‌న వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్‌ఓ ఎవరూ లేరని అన్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా త‌న‌కు తెలియదని స్ప‌ష్టం చేశారు. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశానని, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతో త‌న‌పై కేసులు న‌మోదు చేశార‌ని ఆరోపించారు ఎమ్మెల్సీ భ‌ర‌త్.

త‌న‌ను అప్రతిష్ట పాల్జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అసలు త‌న‌పై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు?. అవన్నీ ఆరా తీస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్సీ.