రేషన్ బండ్లు ప్రజలకు ఇక్కట్లు
జగన్ రెడ్డిపై భగ్గుమన్న చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు రేషన్ బండ్లు ప్రజలకు భారంగా మారాయని పేర్కొన్నారు.
మంగళవారం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇంటింటికీ రేషన్ బండి అంటూ వాహనాలను ప్రవేశ పెట్టాడని, దీని వల్ల ప్రజలు రోడ్ల పాలయ్యారంటూ ఆరోపించారు. అందరూ గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తమ ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులను డీలర్ల వద్ద తీసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. కానీ తను వచ్చాక వాటిని పక్కన పెట్టాడని, డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశాడని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.
గతంలో గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వాళ్ళని తెలిపారు. గత ప్రభుత్వంలో మొత్తం రివర్స్ చేశారని మండిపడ్డారు. ఆ బండి వచ్చే దాకా వీళ్ళు పనులు మానుకుని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.