అక్రమ చొరబాట్లపై రోడ్ మ్యాప్
ప్రకటించారా అని నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ – లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం లోక్ సభలో బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిస్థితులపై చర్చలు జరిగాయి. అంతుకు ముందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఆరా తీస్తోందని చెప్పారు.
బంగ్లాదేశ్ లో ప్రధాన మంత్రి హసీనా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఇండియాలో ఆశ్రయం పొందారు. ఇంగ్లండ్ కు పోదామని అనుకున్నారు. కానీ యూకే ప్రభుత్వం ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అక్కడ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్బంగా జరిగిన చర్చల్లో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ చొరబాట్లను ఎదుర్కోవడానికి రోడ్ మ్యాప్ ను ఏమైనా తయారు చేశారా అని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించి జై శంకర్ సమాధానం ఇచ్చారు. సరిహద్దు సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగకుండా చూస్తామన్నారు.