రేవంత్ పాలన భేష్ – జగ్గా రెడ్డి
మంచి పనులపై నిందలు వేస్తే ఎలా
హైదరాబాద్ – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా నడుస్తోందని కితాబు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు సూపర్ గా నడిచాయని తెలిపారు. విచిత్రం ఏమిటంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ప్రతిపక్షంలో ఉన్న ఎంఐఎం, బీఆర్ఎస్ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఎక్కువగా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగిందన్నారు.
మూసీ నది ప్రక్షాళన చేయాల్నా వద్దా అని నిలదీశారు. మంచి పనులను ఎలాగు మెచ్చుకోరు.. కానీ, నిందలు వేయకండి అని సూచించారు జగ్గా రెడ్డి… మూసీ ప్రక్షాళన అవినీతి కోసం అని బీజేపీ నేతలు అంటున్నారు.. మరి గంగా ప్రక్షాళన కూడా మోడీ అందుకే చేస్తున్నారా అని సంచలన ఆరోపణలు చేశారు.