కేటీఆర్ కు షాక్ కేసు నమోదు
మేడిగడ్డ వద్ద డ్రోన్ వాడారని ఫిర్యాదు
భూపాలపల్లి జిల్లా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ కామెంట్స్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ సర్కార్ పై. కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే ప్రాజెక్టులు కట్టారంటూ ఆరోపణలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్.
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా డ్రోన్ ను వాడారు. ప్రజలకు వివరంగా ఏం జరిగిందో చెప్పేందుకు దీనిని వాడినట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.
ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా మాజీ మంత్రి కేటీఆర్ ఎలా డ్రోన్లను వాడుతారంటూ ప్రశ్నించారు పోలీసులు. ఈ మేరకు కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, బాల్క సుమన్ లతో పాటు సెక్షన్ 223(బి) బీఎన్ఎస్ఎస్ కింద కేటీఆర్ పై తొలి కేసు నమోదు చేశారు.