DEVOTIONAL

ద‌ర్శ‌న టికెట్ల కోసం ద‌ళారుల‌ను న‌మ్మ‌కండి

Share it with your family & friends

హెచ్చ‌రించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల – టీటీడీ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌ల రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ళారుల‌ను ఎట్టి ప‌రిస్థితుల‌లో న‌మ్మ వ‌ద్ద‌ని కోరారు. గ‌త కొంత కాలంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి టికెట్లు ఇప్పిస్తామంటూ మ‌ధ్య‌వ‌ర్తులు కొంద‌రు భ‌క్తుల‌ను మోసం చేస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు.

కేవ‌లం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే టికెట్ల‌ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ద‌ళారుల‌ను సంప్ర‌దించ వ‌ద్ద‌ని కోరారు. ఇటీవలి వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించామ‌ని తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు.

అటువంటి వాటిని బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోందన్నారు.

దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా గుర్తించామ‌న్నారు ఈవో. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్‌లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.

అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చ‌రించారు,