NEWSINTERNATIONAL

ఇరాన్ మిస్సైల్స్..డ్రోన్ల‌ను అనుమ‌తించం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సౌదీ అరేబియా చీఫ్

సౌదీ అరేబియా – ఇరాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సౌదీ అరేబియా. బుధ‌వారం ఆ దేశానికి చెందిన రాజు బిన్ స‌ల్మాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య‌.

ఇదిలా ఉండ‌గా హ‌మాస్ చీఫ్ ఇస్మాయెల్ ను ఎయిర్ క్రాఫ్ట్ దాడుల్లో మ‌ట్టు బెట్టింది ఇజ్రాయెల్. దీనిపై సీరియ‌స్ అయ్యారు ఇరాన్ చీఫ్‌. అంత‌ర్జాతీయ న్యాయ సూత్రాల‌ను ఇజ్రాయెల్ ఉల్లంఘించింద‌ని, ఈ మేర‌కు తాము ప్ర‌త్య‌క్ష దాడుల‌కు దిగ బోతున్నామంటూ ప్ర‌క‌టించారు. దీనిపై యూఎన్ జన‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సౌదీ అరేబియా ప్రిన్స్ స్పందించారు. ఇరాన్ కు చెందిన క్షిప‌ణ‌లు లేదా డ్రోన్లు త‌మ గ‌గ‌న త‌లం నుండి ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు అనుమ‌తించ బోమంటూ ప్ర‌క‌టించారు బిన్ స‌ల్మాన్.

ఇరాన్ త‌మ గ‌గ‌న త‌లానికి దూరంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.