హిందువులను కాపాడండి – ఆర్ఎస్ఎస్
(ఆర్ఎస్ఎస్) సీనియర్ నేత సురేష్ భయ్యా జోషి
న్యూఢిల్లీ – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ నేత సురేష్ భయ్యా జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న వరుస ఘటనలపై , ప్రస్తుత పరిస్థితిపై స్పందించారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పట్టించు కోవాలని కోరారు.
ఆర్ఎస్ఎస్ అక్కడ నివసిస్తున్న హిందువులకు పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఏ ఒక్క హిందువుకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఉందన్నారు సురేష్ భయ్యా జోషి.
వెంటనే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు పూర్తి రక్షణ కల్పించేలా చూడాలని , ఈ మేరకు అవసరమైతే ఆర్మీ చీఫ్ తో సంప్రదింపులు జరపాలని సూచించారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిగట్టుకుని ముస్లిం ఛాందసవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో ప్రార్థనా మందిరాలను కూడా ఉండనీయడం లేదని పేర్కొన్నారు. మోడీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు సురేష్ భయ్యా జోషి.