భవిష్యత్ తరం రెజ్లర్ల కోసం పోరాటం
రెజ్లర్ బజరంగ్ పునియా కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా షాకింగ్ కామెంట్స్ చేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ తనతో మరికొందరు మహిళా రెజ్లర్లు కలిసి మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ప్రస్తుతం కూడా ఆయన తన నిరసనను ఆపడం లేదు.
తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ ఫెడరేషన్ చీఫ్ పై సంచలన ఆరోపణలు చేసిన వినేష్ ఫోగట్ కూడా సత్తా చాటడం విశేషం. ఆమె తన విభాగంలో ప్రముఖ క్రీడాకారిణిని ఓడించింది. స్వర్ణ పతకంపై కన్నేసింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది వినేష్ ఫోగట్.
నేను నా కోసం పోరాటం లేదు. భవిష్యత్ తరం రెజ్లర్ల కోసం పోరాడుతున్నానని అన్నారు. నా కెరీర్ ముగిసింది..ఇదే నా చివరి ఒలింపిక్స్ అని భావోద్వేగానికి లోనైంది. రెజ్లర్లు క్షేమంగా కుస్తీ పట్టేందు కోసం , పోరాడే యువతుల కోసం తాను పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇలాంటి యువతులను తయారు చేయాలన్నదే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా. ఇవాళ దేశానికి గర్వ కారణంగా నిలిచింది వినేష్ ఫోగట్ అంటూ కొనియాడారు. ఇలాంటి వాళ్లే దేశానికి కావాల్సిన అవసరం ఉందన్నారు.