SPORTS

ఓడినా భార‌తీయుల మ‌న‌సు గెలిచారు

Share it with your family & friends

మీ పోరాటం అద్భుతమ‌న్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – లోక్ స‌భలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పారిస్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన హాకీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు కేవ‌లం ఒకే ఒక్క గోల్ తేడాతో ఓడి పోవ‌డంపై స్పందించారు. మీరు ఓడి పోయినా స‌రే 143 కోట్ల భార‌తీయుల మ‌న‌సు గెలిచార‌ని ప్ర‌శంసించారు. మీరు ప్ర‌ద‌ర్శించిన పోరాట ప‌టిమ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునేలా చేసింద‌ని పేర్కొన్నారు.

బుధవారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా రాహుల్ గాంధీ స్పందించారు. ఆయ‌న భార‌త హాకీ జ‌ట్టుకు సంబంధించిన అద్భుత‌మైన ఫోటోను పంచుకున్నారు. మీలాంటి ఆట‌గాళ్లు ఈ దేశానికి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఆట అన్నాక గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని, ఓడి పోయిన‌ప్పుడు కుంగి పోవ‌ద్ద‌ని గెలిచిన‌ప్పుడు అహంతో ఉండ వ‌ద్ద‌ని సూచించారు. ఏది ఏమైనా మీరు ఈ ఒలింపిక్స్ లో అద్భుతంగా రాణించార‌ని కానీ సెమీస్ లో ఓట‌మి పొంద‌డం త‌న‌ను కూడా బాధ‌కు గురి చేసింద‌ని తెలిపారు రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా ఇవాళ పారిస్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క సెమీస్ లో భార‌త జ‌ట్టు జ‌ర్మ‌నీతో 2-3 తేడాతో ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం ర‌జ‌త ప‌త‌కం కోసం ఆడాల్సి ఉంది.