NEWSTELANGANA

మ‌హాత్ముడికి మ‌ర‌ణం లేదు – సీఎం

Share it with your family & friends

డ‌ల్లాస్ లో గాంధీ విగ్ర‌హానికి నివాళి

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న వెంట ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఐటీ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ తో పాటు ఆర్థిక కార్య‌ద‌ర్శి రామ్మోహ‌న్ రావు కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా గురువారం డ‌ల్లాస్ లో ఏర్పాటు చేసిన జాతిపిత మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని సంద‌ర్శించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఈ సంద‌ర్బంగా పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన మ‌హ‌నీయుడు మ‌హాత్మా గాంధీ అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న భౌతికంగా లేక పోయినా , త‌ను ప్ర‌వ‌చించిన అహింస అనే సిద్దాంతం కోట్లాది మందిని ప్ర‌భావితం చేసింద‌ని..ఇంకా చేస్తూనే ఉంద‌ని అన్నారు.

మార్టిన్ లూథ‌ర్ కింగ్ , నెల్స‌న్ మండేలా లాంటి నేత‌ల‌కు గాంధీనే స్పూర్తి అని తెలిపారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా సైతం త‌న‌ను ప్ర‌భావితం చేసిన నేత ఒకే ఒక‌రు అని ఆయ‌న మ‌హాత్ముడని చెప్పార‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. డ‌ల్లాస్ లో గాంధీ విగ్ర‌హాన్ని సంద‌ర్శించడం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు సీఎం.