NEWSTELANGANA

ఎడిట‌ర్ శ్రీ‌రామ్ కర్రి వైర‌ల్

Share it with your family & friends

యుఎస్ టూర్ లో ఎడిట‌ర్

హైద‌రాబాద్ – ఎవ‌రీ శ్రీ‌రామ్ క‌ర్రి అనుకుంటున్నారా. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటే ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌తంలో కూడా సీఎం వెంట దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటే శ్రీ‌రామ్ క‌ర్రి ప్ర‌ధానంగా ఉండ‌డం, ఆయ‌న‌తో పాటే మీడియాకు స‌మాధానాలు ఇవ్వ‌డం కూడా కొంత విస్తు పోయేలా చేసింది. ఇప్ప‌టికే ఆంధ్రాకు చెందిన కొంద‌రు డామినేట్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు.

ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి హోదాలో అధికారిక ప‌ర్య‌ట‌న చేసిన స‌మ‌యంలో అందుకు సంబంధించి ప్ర‌భుత్వం నియ‌మించిన సీపీఆర్ఓ, పీఆర్ఓలతో పాటు ఉన్న‌తాధికారులు చూస్తారు. ఇందుకు సంబంధించి వార్త‌ల‌ను , స‌మాచారాన్ని చేర వేస్తారు. దీనిని అధికారికంగా ప్ర‌క‌ట‌న రూపంలో లేదా అధికారిక సామాజిక ఖాతాల ద్వారా ప్ర‌భుత్వం తెలియ చేస్తుంది.

డెక్క‌న్ క్రానిక‌ల్ ఎడిట‌ర్ గా ఉన్న శ్రీ‌రామ్ క‌ర్రి ఎలా సీఎంతో ప్ర‌యాణం చేస్తార‌నే దానిపై తెలంగాణ వాదులు మండి ప‌డుతున్నారు. గ‌తంలో మ‌నోడు మాజీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి వ‌ద్ద పీఆర్ఓగా, బండి సంజ‌య్ ద‌గ్గ‌ర అన‌ధికారికంగా ప‌ని చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మొత్తంగా శ్రీ‌రామ్ క‌ర్రి ఇలా వైర‌ల్ కావ‌డం విశేషం.