సీఎం సిద్దరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ
వన్య ప్రాణి, అటవీ సంరక్షణపై చర్చలు
బెంగళూరు – కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో గురువారం భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన తర్వాత తొలిసారి కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శించడం. ప్రస్తుతం అటవీ శాఖతో పాటు పలు కీలక శాఖలను తను పర్యవేక్షిస్తున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలను ప్రస్తావించారున్న పవన్ కళ్యాణ్. సీఎంతో పాటు కర్ణాటక రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.
అనంతరం పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే గారితో చర్చలు జరిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా సీఎంతో తెలిపారు .