వక్ఫ్ బిల్లుపై కౌసర్ జహాన్ కామెంట్
బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అత్యంత వివాదాస్పదమైన వక్ఫ్ (సవరణ) బిల్లు 2024కు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ లో ఆమోదం తెలిపేందుకు ప్రవేశ పెట్టింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి.
వక్ఫ్ (సవరణ ) బిల్లు 2024పై స్పందించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లా రాష్ట్ర హజ్ కమిటీ చైర్ పర్సన్ కౌసర్ జహాన్. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పారదర్శక, జవాబుదారీ, సమాన ప్రాతినిధ్యం కోసం ప్రభావవంతమైన చట్టాన్ని రూపొందించడానికి సవరణ ఒక ప్రధాన ముఖ్యమైన అడుగు అని కౌసర్ జహాన్ పేర్కొన్నారు.
21వ శతాబ్దపు అన్ని వర్గాల భాగస్వామ్యానికి అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, మహిళలను చేర్చుకోవడం అనేది రెండవదని, ఏదైనా వివాదం ఉంటే, వక్ఫ్ బోర్డ్‌కు బాధ్యత వహిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు కౌసర్ జహాన్.
అవినీతి, అశ్రిత పక్షపాతం, అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకే తమ బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు.