హర్యానా ఫోగట్ కు రూ.4 కోట్ల నజరానా
ప్రకటించిన హర్యానా ప్రభుత్వం
హర్యానా – ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు రూ. 4 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. గురువారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినేష్ ఫోగట్ ను తాము ఛాంపియన్ గా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినేష్ ఫోగట్ చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఒలింపిక్స్ 2024 పోటీలు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో వినేష్ ఫోగట్ 50 కేజీల రెజ్లింగ్ పోటీల విభాగంలో ఏకంగా ఫైనల్ కు చేరుకున్నారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి పారిస్ ఒలింపిక్స్ కమిటీ సంచలన ప్రకటన చేసింది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడం కారణంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేలా చేసింది.
పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలు ప్రస్తావించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. వినేష్ ఫోగట్ ఎంతో కష్ట పడ్డారని, ఆమెకు భారత రత్న లేదా రాజ్య సభ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హర్యానాకు చెందిన క్రీడాకారిణి కావడంతో వినేష్ ఫోగట్ కు భారీ నజరానా ప్రకటించడం విశేషం.