NEWSNATIONAL

మ‌త్స్య‌కారుల గోడు విన్న రాహుల్ గాంధీ

Share it with your family & friends

న్యూఢిల్లీలో బాధితుల‌తో ముఖాముఖి

ఢిల్లీ – లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన మ‌త్స్య‌కారుల‌తో స‌మావేశం అయ్యారు. గురువారం న్యూఢిల్లీలోని పార్ల‌మెంట్ హౌస్ లోని రిసెప్ష‌న్ హాలులో ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. త‌మ సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను, ఇబ్బందుల గురించి ఆరా తీశారు రాహుల్ గాంధీ.

ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. మ‌త్స్య కారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి స‌రైన భ‌ద్ర‌త‌, ఉపాధి ఉండ‌డం లేద‌ని వాపోయారు. ప్ర‌ధానంగా స‌ముద్రంలో చేప‌లు ప‌ట్టే స‌మ‌యంలో వ‌త్తిడి ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు రాహుల్ గాంధీకి.

పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేకంగా ఇటీవ‌ల ప్ర‌స్తావించారు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు. ప్ర‌తిప‌క్షాలు మ‌త్స్య కారుల‌కు అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా త‌మ పార్టీ మీ వెంట ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా సాయం చేసేలా తాను లోక్ స‌భ‌లో లేవ‌దీస్తాన‌ని చెప్పారు.

ఈ సంద‌ర్బంగా మ‌త్స్య కారుల ప్ర‌తినిధులు రాహుల్ గాంధీతో జ‌రిగిన సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా సాగింద‌ని పేర్కొన్నారు.