భారత్ విజయం కాంస్య పతకం
స్పెయిన్ ను ఓడించిన ఇండియా
ఫ్రాన్స్ – పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన కీలక పోరులో స్పెయిన్ జట్టుపై గెలిచింది. కాంస్య పతకాన్ని స్వంతం చేసుకుంది. 52 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ సింగ్ గోల్స్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.
ఇండియా చివరిసారిగా 1968, 1972లో జరిగిన ఒలింపిక్స్ లో హాకీ పరంగా పతకాలను గెలుచుకుంది. ఇదిలా ఉండగా ఈ కాంస్య పతకంతో భారత పతకాల సంఖ్య ఒలింపిక్స్ లో నాలుగుకు చేరింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్పెయిన్ తో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది.
భారత జట్టు 2-1 తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఒక దశలో 0-1తో వెనుకబడిన ఇండియా హాకీ జట్టు ఊహించని రీతిలో దాడి చేసింది. ప్రధానంగా జట్టు స్కిప్పర్ హన్మన్ ప్రీత్ సింగ్ వరుసగా గోల్స్ తో హోరెత్తించాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.
తొలి సెషన్ లో స్పెయిన్ ప్లేయర్ మిరల్లెస్ గోల్ కొట్టాడు. దీంతో ఇండియా జట్టును ఒత్తిడి లోకి నెట్టాడు. ఆఖరున హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ సాధించి సమం చేశాడు. అనంతరం రెండో సెషన్ లో కెప్టెన్ సింగ్ చెలరేగాడు..పెనాల్టీ కార్నర్ ను అద్భుతంగా గోల్ గా మార్చాడు
కాగా ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న ప్రధాన గోల్ కీపర్ శ్రీజేష్ కు ఘనంగా వీడ్కోలు పలికింది జట్టు. భారత జట్టు కాంస్య పతకం గెలవడంతో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు.