పవన్ ప్రయత్నం సమస్యకు పరిష్కారం
కర్ణాటక ప్రభుత్వంతో ఫలించిన చర్చలు
కర్ణాటక – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ శాఖపై సమీక్ష చేపట్టారు. ప్రధానంగా నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. ఏనుగుల బెడద నుంచి నివారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు గాను కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేలా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు.
అంతే కాకుండా కర్ణాటక పర్యటనలో పవన్ కళ్యాణ్ పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఎర్ర చందనం రక్షణకు ఇరు రాష్ట్రాలు సహకరించాలని నిర్ణయం తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యారు.
ఏడు అంశాలపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిది కుంకి ఏనుగులు ఏపీకి ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారని ఈ సందర్బంగా చెప్పారు పవన్ కళ్యాణ్.
కర్ణాటక పట్టుకున్న ఎర్ర చందనం అప్పగింత విషయంలోనూ చర్చించడం జరిగిందన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, సాంకేతికత పంపకంపై అవగాహన ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఏపీ, కర్ణాటకల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్షిచడం జరిగిందని పేర్కొన్నారు.