హిందువులకు భద్రత కల్పించండి – మోడీ
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి పీఎం సూచన
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముస్లిం ఛాందసవాదులు పేట్రేగి పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానంగా హిందువులే లక్ష్యంగా, దేవాలయాలను ధ్వంసం చేస్తూ దాడులకు దిగుతూ విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇలాంటి చర్యలను తాము సహించ బోమంటూ స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సత్ సంబంధాలు ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని తాము సంమయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ విజేత మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసేందుకు అక్కడి ఆర్మీ చీఫ్ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఆందోళన కారణంగా పరిస్థితి చేయిదాటి పోవడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా.
ఆమె ప్రస్తుతం భారత దేశంలో ఆశ్రయం పొందుతోంది. ఇందులో భాగంగా హిందువుల భద్రతపై ఫోకస్ పెట్టాలని నూతన సర్కార్ కు సూచించారు నరేంద్ర మోడీ. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.