NEWSTELANGANA

ఆమ్జెన్ పెట్టుబ‌డి..3 వేల మందికి ఉపాధి

Share it with your family & friends

హైద‌రాబాద్ ను ఎంచుకున్న యుఎస్ కంపెనీ

అమెరికా – యుఎస్ఏకు చెందిన ఆమ్జెన్ కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా టూర్ లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బృందంతో ఆమ్జెన్ కంపెనీ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లో తాము పెట్టుబ‌డి పెట్టేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.

హైటెక్ సిటీ లోని ఆమ్జెన్ గ్లోబ‌ల్ డిజిట‌ల్ సామ‌ర్థ్యాల‌ను వేగ‌వంతం చేస్తుంది. ప్రాణాల‌ను ర‌క్షించే ఔష‌ధాల పైప్ లైన్ ను ఏర్పాటు చేయ‌నుంది. కంపెనీ గ‌నుక ప‌నుల‌ను విస్త‌రించిన‌ట్ల‌యితే 3,000 మంది ప్ర‌తిభావంతుల‌కు ఉపాధి దొరుకుతుంది.

ఏఐ, డేటా సైన్స్ , లైఫ్ సైన్సెస్ కు కేంద్రంగా మార‌నుంది ఆమ్జెన్ ఇండియా . ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

“ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన ఆమ్జెన్ కంపెనీని హైదరాబాద్‌కు స్వాగతం పలకడం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఇది ఆవిష్కరణ, సాంకేతికతలో ప్రపంచ అగ్రగామిగా భాగ్య‌ నగరం స్థానాన్ని బలోపేతం చేస్తుంది” అని పేర్కొన్నారు.