మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు
మంజూరు చేసిన సుప్రీం కోర్టు
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి స్కామ్ లో పాల్గొన్నారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. ఈ మేరకు పూర్తి నివేదికను సమర్పించాయి కోర్టులో.
ఈ సందర్బంగా కోర్టు మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ప్రస్తుతం కవిత కూడా తీహార్ జైలులో ఉన్నారు. పలుమార్లు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వచ్చారు. కోర్టును ఆశ్రయించారు. చివరకు 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా ఊపిరి పీల్చుకోనున్నారు.
ఇప్పటి వరకు ఎన్ని దాడులు చేసినా ఒక్క రూపాయి కూడా దొరక లేదని పేర్కొన్నారు మనీష్ సిసోడియా.
ఆయనతో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం తీహార్ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
ఈ తరుణంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం విశేషం. శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే దేశం విడిచి వెళ్ల కూడదని స్పష్టం చేసింది తీర్పులో.