NEWSTELANGANA

సిసోడియాకు బెయిల్ క‌విత‌కు లైన్ క్లియ‌ర్

Share it with your family & friends

బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు. కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌ని కేసులో ఇరికించింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసుకు సంబంధించి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు ఇవాళ మంజూరు చేసింది. దీంతో దాదాపు 17 నెల‌ల‌కు పైగా సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి సిసోడియాకు బెయిల్ రావ‌డాన్ని తాము స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు కేటీఆర్. ఇదే స‌మ‌యంలో త‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవితకు కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మకు ఉంద‌న్నారు.

సిసోడియాకు బెయిల్ రాక త‌మ చెల్లెల్లికి కూడా లైన్ క్లియ‌ర్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు కేటీఆర్. మొత్తంగా కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.