సుప్రీంకోర్టులో అమీర్ ఖాన్ వైరల్
వెల్ కమ్ చెప్పిన సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ – ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ శుక్రవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఏదో కేసుకు సంబంధించినవి అనుకున్నారా. కానే కాదు తను లాపతా లేడీస్ తీసిన సినిమాను తీశారు. ఈ సినిమా జెండర్ ప్రాతిపదికన తీశారు. ప్రతి ఏటా సుప్రీంకోర్టు ఇలాంటి సామాజిక అంశాలతో కూడిన సినిమాలను చూస్తుంది.
ఇందులో భాగంగా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు నటుడు అమీర్ ఖాన్. ఇందుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ నాకు కోర్టులో తొక్కిసలాట జరగడం ఇష్టం లేదు . కానీ సినిమా ప్రదర్శన కోసం వచ్చిన మిస్టర్ అమీర్ ఖాన్‌ని తాము స్వాగతిస్తున్నాము. దర్శకుడు కిరణ్‌రావు కూడా త్వరలోనే మాతో చేరనున్నారు’’ అని సీజేఐ తెలిపారు.
రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన గ్రామీణ భారతదేశంలోని ఇద్దరు వధువులపై హృద్యంగా చిత్రీకరించారు దర్శకురాలు. ఈ చిత్రాన్ని రావ్స్ కిండ్లింగ్ ప్రొడక్షన్స్ ..అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, రిజిస్ట్రీ అధికారుల కోసం సినిమాను ప్రదర్శించారు.