ఆగస్టు 15న మూడో విడత రుణ మాఫీ
ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రుణ మాఫీపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అమలు చేయడం జరిగిందన్నారు.
జూలైలో రెండో దఫా కింద రుణాలను మాఫీ చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం. లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణ మాఫీ కారణంగా లబ్ది చేకూరిందన్నారు.
రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణ మాఫీ చేశామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ప్రకటించారు… ఆగస్ట్ లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టు కంటామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.