జగదీప్ ధన్ ఖర్ కామెంట్స్ పై గుస్సా
ఎంపీ జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన పదే పదే సభ్యులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాపోతున్నారు.
ఈ తరుణంలో ఇవాళ సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యురాలు జయా బచ్చన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు ఎంపీలు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఉప రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్బంగా శుక్రవారం జయా బచ్చన్ మీడియాతో మాట్లాడారు. జగదీప్ ధన్ ఖర్ తన స్థాయికి తగినట్లు ప్రవర్తించడం లేదని ఆరోపించారు. ఇలాగేనా సభను నడిపేది అంటూ మండిపడ్డారు. తాము పాఠశాల పిల్లలం కాదని ఆయన గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ఇదిలా ఉండగా జయా బచ్చన్ కు మద్దతుగా నిలిచారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ. ఆమె కూడా రాజ్యసభ చైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయా కు మద్దతుగా నిలిచారు.