NEWSINTERNATIONAL

లండ‌న్ మేయ‌ర్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

సుర‌క్షితంగా లేన‌న్న సాదిక్ ఖాన్

ఇంగ్లండ్ – లండ‌న్ లో ప్ర‌స్తుతం ఎవ‌రూ సుర‌క్షితంగా బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు లండ‌న్ మేయ‌ర్ సాదిక్ ఖాన్. చాలా మంది ముస్లింలు బ‌తికేందుకు ఇక్క‌డికి వ‌చ్చార‌ని, కానీ వారు ప్ర‌తి నిత్యం భ‌యం భ‌యంగా బ‌తుకుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం సాదిక్ ఖాన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న‌త‌మైన ప‌ద‌విలో ఉన్న తాను కూడా ఆందోళ‌న చెందుతున్నాన‌ని, ఇంత‌కంటే ఇంక ఏం చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొన్నారు. ముస్లిం రాజ‌కీయ నాయ‌కుడిగా తాను సుర‌క్షితంగా లేనంటూ వాపోయారు సాదిక్ ఖాన్.

ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చు..బ‌తికే హ‌క్కు ఉంటుంద‌ని, కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో మ‌తాలు, వ‌ర్గాలు, ద్వేషాల మ‌ధ్య‌న మాన‌వ స‌మాజం విడి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విచిత్రం ఏమిటంటే చాలా మంది ఇప్పటికీ తలకు కండువాలు ధరించి ఇంటి నుండి బయటకు వెళ్లడానికి లేదా మసీదులకు వెళ్లడానికి భయపడుతున్నార‌ని కామెంట్ చేశారు సాదిక్ ఖాన్. ప్రజలు మసీదుకు వెళ్లడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని తెలిపారు.

యూకేలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత రైట్ వింగ్ సెంటిెంట్ మరింత బలంగా మారిందన్నారు.