NEWSANDHRA PRADESH

పంధ్రాగ‌స్టు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాలి

Share it with your family & friends

గ్రామ పంచాయ‌తీల‌కు భారీగా నిధులు విడుద‌ల

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఆగ‌స్టు 15 స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ప‌ల్లె ప‌ల్లెన అంగ రంగ వైభవోపేతంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు పంచాయ‌తీల‌కు నిధుల‌ను పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ‌తంలో రూ. 100, రూ. 250 ఇచ్చే వార‌ని కానీ వాటిని ఇప్పుడు రూ. 10 వేలు, రూ. 25 వేల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఉత్స‌వ వేడుక‌ల‌కు నిధుల కొర‌త లేకుండా త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని చెప్పారు. పంచాయతీల్లో ఆరోజు నిర్వ‌హించే వేడుకల‌కు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామని తెలిపారు.

2011 జనాభా ఆధారంగా 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందజేస్తామ‌ని చెప్పారు డిప్యూటీ సీఎం. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందజేస్తామ‌ని తెలిపారు.

పంచాయతీల‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.