హైదరాబాద్ లో అవురుమ్ కంపెనీ పెట్టుబడి
తెలంగాణ సర్కార్ తో అవగాహన ఒప్పందం
అమెరికా – తెలంగాణకు పెట్టుబడులు తీసుకు రావడంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయ్యింది. ఈనెల 13 వరకు ఆయన విదేశీ పర్యటనలో బిజీగా ఉండనున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని దిగ్గజ కంపెనీలతో చర్చించారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇందుకు వారంతా సానుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన 14 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
తాజాగా మరో దిగ్గజ కంపెనీ అవురుమ్ హైదరాబాద్ లో అత్యాధునిక ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు 400 మిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం సదరు కంపెనీ చైర్మన్ , సీఈవోలు డేటా సెంటర్ కు ఓకే చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా అవురుమ్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.