దూసుకు పోతున్న హనుమాన్
వసూళ్ల వేటలో ముందంజ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భక్తి కథా చిత్రం హనుమాన్ జోరు మీదుంది. జనవరి 12న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు సినిమాలు విడుదలయ్యాయి. కథలో బలం ఉంటే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం కల్పించాడు దర్శకుడు.
ఇక ఈ సినిమా విడుదల సమయంలో పెద్ద రచ్చ చోటు చేసుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీ కూడా విడుదలైంది. దీనికి ఎక్కువగా థియేటర్లు కేటాయించారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత దిల్ రాజు.
కానీ ఊహించని రీతిలో మహేష్ మూవీ బోల్తా పడింది. కానీ హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దేశ వ్యాప్తంగా హనుమాన్ కు ఆదరణ లభిస్తోంది. ఏకంగా నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటేసింది. ప్రస్తుతం రూ. 150 కోట్ల క్లబ్ లోకి దూసుకు పోతోంది.
తొలి రోజు రూ. 21.35 కోట్లు , 2వ రోజు రూ. 29.72 కోట్లు, 3వ రోజు రూ. 24.16 కోట్లు, 4వ రోజు రూ. 25.63 కోట్లు, 5వ రోజు రూ. 19.57 కోట్లు వసూలయ్యాయి. ఇప్పటి వరకు హనుమాన్ వసూలు చేసిన మొత్తం రూ. 120.43 కోట్లు కావడం విశేషం.