NEWSNATIONAL

బంగ్లాదేశ్ లో భార‌త్ జోక్యం చేసుకోవాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన షేక్ హ‌సీనా కుమారుడు

బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా కుమారుడు స‌జీబ్ వాజీద్ జాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న త‌ల్లిని ర‌క్షించినందుకు , భార‌త దేశంలో ఆశ్ర‌యం ఇచ్చినందుకు, ర‌క్ష‌ణ క‌ల్పించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీకి.

అవామీ లీగ్ పాలనలో బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా ఉంటారని అన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారని స‌జీవ్ వాజిద్ జాయ్ ప్రకటించారు.

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ సమాజంలో ప్రయత్నాలకు నాయకత్వం వహించాలని భారతదేశానికి జాయ్ పిలుపునిచ్చారు. ఒక‌వేళ అలా చేయ‌క పోతే బంగ్లాదేశ్ మ‌రో పాకిస్తాన్ ఉగ్ర వాద దేశంగా మారి పోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం ఆసియా ఖండంలో అత్యున్న‌త‌మైన ప్ర‌జాస్వామిక విలువ‌లు క‌లిగిన దేశంగా భార‌త దేశానికి పేరు ఉంద‌ని పేర్కొన్నారు స‌జీబ్ వాజిద్ \జాయ్. ఛాంద‌వాసుల‌కు బంగ్లాదేశ్ లో చోటు లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు. వారి ఆట‌లు సాగ‌నీయ లేద‌నే అక్క‌సుతోనే త‌న త‌ల్లిని దేశం నుంచి బ‌య‌ట‌కు పంపించారంటూ ఆరోపించారు.